రేపు రాజాంలో మోటర్ సైకిల్ వేలం
VZM: రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ కేసులో పట్టుబడిన ఒక ద్విచక్ర వాహనాన్ని వేలం వేయనున్నట్లు సీఐ అశోక్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ వేలం పాట జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనే ఆసక్తి కలిగిన వారు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని రాజాం పోలీస్ స్టేషన్‌కి మంగళవారం ఉదయం 8గంటలకు రావాలన్నారు.