జిల్లాలో 137.2 మి.మీ వర్షపాతం
సత్యసాయి: జిల్లా వ్యాప్తంగా 137.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు మంగళవారం జిల్లా గణాంకాల అధికారి గంగాధర్ తెలిపారు. మొంథా తుఫాను ప్రభావంతో 32 మండలాలకు గాను 28 మండలాలలో వర్షం కురిసిందన్నారు. అత్యధికంగా పెనుకొండ మండలంలో 19.0 మి.మీ, గోరంట్ల 12.2, రామగిరి 11.8, పుట్టపర్తి 9.4, రొద్దం మండలంలో 9.2 మి.మీ వర్షపాతం నమోదైంది అన్నారు.