ఉచిత గాలికుంట వ్యాధి నిరోధిక టీకా కార్యక్రమం
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ఇవాళ పాడి పశువులకు ఉచిత గాలికుంట వ్యాధి నిరోధిక టీకాల కార్యక్రమాన్ని పశు వైద్యాధికారులు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని పాడి రైతులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.