కుంభాభిషేక మహోత్సవంలో మాజీ మంత్రి రోజా

కుంభాభిషేక మహోత్సవంలో మాజీ మంత్రి రోజా

TPT: పుత్తూరులోని 2వ వార్డు కే.ఎం. అగ్రహారంలో వేంకటేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని అభిషేకించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజాకు ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానం చేశారు.