గుల్లకోట యువకుడికి బీఎస్‌ఎఫ్‌లో స్థానం
JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన పొన్నం మణి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికైన సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డా. గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ నేతృత్వంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఆవరణలో మణిని అభినందించారు.