50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛను ఇవ్వాలని మంత్రికి వినతి

50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛను ఇవ్వాలని మంత్రికి వినతి

W.G: విజయవాడ విమానాశ్రయంలో మంగళవారం మంత్రి నారా లోకేశ్‌ను బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ గణేశ్ భవానీ కలిశారు. బీసీ హాస్టల్స్‌లో విద్యార్థులకు ప్రభుత్వం బ్లడ్ గ్రూపింగ్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని అదేశాలు ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. అలానే 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛను ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరినట్లు గణేశ్ తెలిపారు.