ఎంజీఎం ఆసుపత్రి నూతన సూపరిండెంట్‌గా హరీష్ చంద్రరెడ్డి
WGL: MGM ఆసుపత్రి కొత్త సూపరింటెండెంట్ గా డా.హరీష్ చంద్రరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆసుపత్రి అధికారులు, సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో పాత సూపరింటెండెంట్ డా.కిశోరు కుమార్ ను తప్పించి, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డా.హరీష్ చంద్ర రెడ్డిని నియమించింది.