'విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి'
BDK: ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదువుకోవాలని సీఐ రాజువర్మ విద్యార్థులకు సూచించారు. చర్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఏ రంగంలో విద్యార్థులు ఆసక్తి చూపిస్తారో వారిని ఆ దిశగా ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పట్టుదలతో విద్యార్థులు చదవాలన్నారు.