7ఏళ్ల బాలిక అదృశ్యం
MNCL: దండేపల్లి మండలం నంబాల గ్రామంలో 7ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు ఎస్సై తాజోద్దీన్ తెలిపారు. శనిగారపు శేఖర్ చిన్న కుమార్తె మహాన్విత ఇంటి సమీపంలో ఆడుకుంటూ మాయమైందన్నారు. గ్రామంలో గాలించినా జాడ దొరకకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.