VIDEO: మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

MDK: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్‌లో నమోదు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆరోపించారు.