VIDEO: 'అన్న క్యాంటీన్‌లో పార్సెల్ తీసుకెళ్లడం నిషేధం'
కృష్ణా: ఆగస్టు నెల 2024లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్న క్యాంటీన్‌ను గుడివాడలో ప్రారంభించారని కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు మంగళవారం అన్నారు. పేద ప్రజలకు ఈ సేవలు మరింత సమర్థవంతంగా ఉండాలని భావించి క్యాంటీన్ నిర్వహణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశానని చెప్పారు. అన్న క్యాంటీన్ ద్వారా అందించే టిఫిన్, భోజనం పార్సెల్ తీసుకెళ్లడం నిషేధమని తెలిపారు.