చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన సుధామూర్తి
VSP: రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్వాన్ని నిత్యం కలిగి ఉంటున్నారు. ఆదివారం విశాఖ నుంచి తిరిగి వెళ్లే సమయంలో హెలిప్యాడ్ వద్ద తనను పలకరించిన చిన్నారులను ఆప్యాయంగా హత్తుకున్నారు. హెలిప్యాడ్ నుంచి వెనక్కి వచ్చి వారితో ఫోటోలు దిగారు. దీంతో చిన్నారులంతా సంతోషం వ్యక్తం చేశారు.