'బార్ నిర్వహణకు నేను సహకరిస్తా'

ELR: దెందులూరు నియోజకవర్గంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బార్ నిర్వహణకు కూడా తాను పూర్తి సహకారం అందిస్తానని చింతమనేని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా దాని ద్వారా వచ్చే లాభాలను సైతం గౌడ సంఘం ప్రజల సంక్షేమానికే వినియోగించుకునేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని అన్నారు.