మండలంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ
KMR: రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు శశి కుమార్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ పెద్దలు బాణాల సంజీవ రెడ్డి, ఏపీఎం, గ్రామ ప్రజలు ఎస్‌ఎచ్‌జీ సభ్యులు హాజరయ్యారు.