సహకారం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నిరసన
కోనసీమ: రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం ఆత్రేయపురంలో కోపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 36 ను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగులకు ఆరోగ్య భీమా కల్పించాలని తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.