'చట్ట వ్యతిరేక శక్తులకు అరికట్టడానికి 28 ప్రత్యేక బృందాలు'

'చట్ట వ్యతిరేక శక్తులకు అరికట్టడానికి 28 ప్రత్యేక బృందాలు'

E.G: జిల్లాలో చట్ట వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నగరంలో పోలీసులపై దాడి జరిగిన ఘటన అనంతరం జిల్లాలో డ్రంక్ & డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 90 వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు.