గుంతకల్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని వినతి

గుంతకల్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని వినతి

TPT: రేణిగుంట - గుంతకల్ రైలు మార్గంలో పరిష్కారానికి నోచుకోని సమస్యలను సత్వరం పరిష్కరించాలని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గురువారం ఢిల్లీలోని రైల్వే శాఖ సహాయ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. రాజంపేట రైల్వే కేంద్రంలో సగంలో ఆగిపోయిన రైల్వే అండర్ బ్రిడ్జిని గతిశక్తి పథకం క్రింద వందశాతం నిధులు కేంద్రం ఖర్చుపెట్టి పనులు పూర్తి చేయాలని కోరారు.