విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వాహణ
SKLM: ఎచెర్ల(M)ముద్దాడ జడ్పీ హై స్కూల్‌లో గురువారం మ్యాథ్స్ డే సందర్భంగా క్విజ్ పోటీ నిర్వహించారు. గణిత ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రామ్మోహన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని అన్నారు.