జిల్లా ప్రజలకు ఎస్పీ సూచన

SRD: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అత్యవసరం అయితే 100, 8712656739 నెంబర్లకు ఫోన్ చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు చెరువులు కుంటల వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండకూడదని తెలిపారు.