VIDEO: అధికారిపై కుంకి ఏనుగు దాడి

CTR: పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ క్యాంపులో ఓ అధికారిపై ఏనుగు దాడి చేసింది. చవితి సందర్భంగా ఏనుగులకు ఆహారం అందిస్తున్నప్పుడు జయంత్ అనే ఏనుగు రఘునాథ్ అనే అధికారిని తోసివేసింది. దీంతో స్వల్ప గాయాలు కాగా పలమనేరు ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అనంతరం చిత్తూరులో ఆసుపత్రి చేర్చారు.