రోడ్డు ప్రమాదాల నివారణకు 'అరైవ్ అలైవ్'

రోడ్డు ప్రమాదాల నివారణకు 'అరైవ్ అలైవ్'

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి, భద్రతపై అవగాహన కల్పించడానికి 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని చేపట్టామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 14న ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. పోలీసు, రవాణా శాఖలతో పాటు కార్పొరేట్ సంస్థలు, సినీ ప్రముఖులు, విద్యాసంస్థలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు.