పుంగనూరులో వెన్నుపోటు దినం పోస్టర్లు ఆవిష్కరణ

CTR: అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని చిత్తూరు మాజీ MP రెడ్డప్ప అన్నారు. వైసీపీ ఈ నెల 4న తలపెట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పుంగనూరులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు.