పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
NLR: సంగం మండలం గాంధీ జనసంఘంలో పెన్షన్ల పంపిణీ సోమవారం జరిగింది. జోరువానలోనూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రజల ఇంటి వద్దకే వెళ్లి నగదు అందజేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయన వెంట కూటమి నాయకులు, తదితరులు ఉన్నారు.