రేపు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

PLD: నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరగనుంది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదివారం సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని లేదా వివరాల కోసం 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని ఆమె తెలిపారు.