వైద్యులు సమయపాలన పాటించాలి: DMHO

వైద్యులు సమయపాలన పాటించాలి: DMHO

WGL: నల్లబెల్లి మండలం మేడపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని DMHO సాంబశివరావు అన్నారు. గురువారం సాయంత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యులు సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.