రైల్వే ప్రాజెక్ట్ కోసం చొరవ చూపాలి: శంకర్ నాయక్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. జిల్లా కోసం మంజూరైన 930 కోట్లు వ్యయమైన రైల్వే ప్రాజెక్ట్‌ను ఇతర ప్రాంతాలకు తరలించకూడదని, కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్ట్ విషయంలో చొరవ చూపాలని, రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని హెచ్చరించారు.