శిథిలావస్థకు చేరిన లింగాల వాగు బ్రిడ్జి

KRNL: తుగ్గలి మండలంలోని గిరిగేట్ల సమీపంలో లింగాల వాగుపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. ఇరువైపులా పగుళ్లు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రాలయం-బెంగళూరు మార్గంలో ఉండటంతో పెద్ద మొత్తంలో రాకపోకలు సాగుతున్నాయి. రెయిలింగ్‌లు దెబ్బతినగా, అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.