పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం.. కారణమిదే.!
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో పోలయ్య అనే వృద్ధుడు భార్యతో గొడవపడి, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే 80% పైగా శరీరం కాలిపోయింది. మద్యం మొత్తంలో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.