రెండో పెళ్లికి అంగీకరించలేదని భార్యను..!
AP: రెండో పెళ్లికి అంగీకరించలేదని భార్యను దారుణంగా కొట్టిన ఘటన కాకినాడ జిల్లా వేమవరంలో జరిగింది. 2021లో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవి, మణికంఠ ప్రేమవివాహం చేసుకున్నారు. మణికంఠ తన మేనకోడలిని రెండో పెళ్లి చేసుకోవాలనుకోగా దేవి వ్యతిరేకించింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమెను రోడ్డుపై పడేసి కొట్టాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.