ముగిసిన అర్బన్ బ్యాంక్ ఆఫీస్ బేరర్ల ఎన్నికలు
KNR: సహకార అర్బన్ బ్యాంక్, ఆఫీస్ బేరర్ల ఎన్నికలు సోమవారం ఉదయం బ్యాంక్ కార్యాలయంలో జరిగాయి. అధ్యక్షుడిగా కర్ర రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి ఎవరు నామినేషన్ సమర్పించనందున, మిగతా 11 మంది సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ ప్రకటించారు. నూతన పాలకవర్గ పదవీకాలం ఐదు సంవత్సరాల వరకు కొనసాగుతుందన్నారు.