డంపింగ్ యార్డ్ క్లీన్.. అక్కడ పార్కు ఏర్పాటు.!
PLD: సత్తెనపల్లి పట్టణ డంపింగ్ యార్డును స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. యార్డులోని 19 వేల టన్నుల చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పార్కుగా మారుస్తామని ప్రకటించారు. మురుగునీటి శుద్ధి కోసం ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.