VIDEO: రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
KRNL: మంత్రాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వీరభద్ర స్వామి, సిద్ధలింగయ్య స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర జలాలతో జలాభిషేకం, రుద్రాభిషేకం చేశారు. చందనం, విభూతితో అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.