ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
BDK: పినపాక మండలం పోతురెడ్డిపల్లి బయ్యారం మసీదు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చెరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.