గోకవరంలో కోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు

E.G: గోకవరం మండలంలో కోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. సోమవారం గోకవరంలో తనిఖీలు నిర్వహించగా ఒక వ్యక్తి కోడి కత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. అతని వద్ద నుంచి 15 కోడి కత్తులు, రెండు తయారీ మిషన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎక్కడైనా జూదం, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.