అన్ని వార్డుల్లో అగమ్య గోచరంగా వీధిలైట్ల సమస్య..!
HYD: గ్రేటర్ HYD నగరంలో వీధి దీపాలు వెలగకపోవడం ప్రతి వార్డులోనూ ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం 300 వార్డులు ఉన్న నగరంలో ఈ పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారుతోంది. చీకటి కారణంగా రాత్రివేళ రోడ్డు ప్రమాదాలు, చోరీలు, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశాలు పెరుగుతున్నాయని, వెంటనే మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.