ST యువతకు ఉపాధి అవకాశాలు
JGL: తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎస్టీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆన్‌లైన్ ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కే. రాజ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ఆసక్తిగల ఎస్టీ నిరుద్యోగులు https://deettelangana.gov.in ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.