ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి.. రూ.2.66 లక్షల రికవరీకి ఆదేశం

ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి..  రూ.2.66 లక్షల రికవరీకి ఆదేశం

CTR: రామకుప్పం మండలంలో గత మార్చి వరకు ఏడాదిలో జరిగిన ఉపాధి పనుల్లో రూ.2.66 లక్షల అవినీతి జరిగిందని వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రికవరీ చేయించాలని డీఆర్డీఏ పీడీ రవికుమార్ ఆదేశించారు. రామకుప్పం ఉపాధి హామీ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలో ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పించాలన్నారు.