జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే షాజహాన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు. ఆసుపత్రిలో తాగునీటి సౌకర్యం లోపాలు, సెక్యూరిటీ సిబ్బంది అక్రమ వసూళ్లపై వస్తున్న ఫిర్యాదులపై ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.