లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు అందజేయాలి: సీపీఎం
కృష్ణా: ఉయ్యూరు టిడ్కో గృహ లబ్ధిదారులందరికీ తక్షణమే ఇళ్లను కేటాయించి అందజేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి బీ.రాజేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపాలిటీ ఛైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్‌కు లబ్ధిదారుల తరపున అర్జీని సమర్పించారు.