VIDEO: కాలువలను శుభ్రం చేసిన ఛైర్మన్
WGL: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఇవాళ వర్ధన్నపేటలో నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని 5వ వార్డు గుబ్బెడతండాలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి మున్సిపల్ సిబ్బందితో కలసి కాలువలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.