ప్రాచీన యోగాపై అవగాహన

ప్రాచీన యోగాపై అవగాహన

PDPL: సింగరేణి కార్మిక కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నెల 10న ఉదయం 10 గంటలకు గోదావరిఖని RCOA క్లబ్ ఆవరణలో ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం నిర్వహించనున్నట్లు రామగుండం RG-GM లలిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగా గురువు షణ్ముఖ శివచంద్ర సారథ్యంలో యోగా వల్ల ఆరోగ్య పరిరక్షణ, ఫలితాలు, తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారన్నారు.