భారీ వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

NTR: ప్రకాశం బ్యారేజీకి వరద ఉదృతి పెరుగుతుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బ్యారేజీలోకి 3.91 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. సాయంత్రం లేదా రేపటికి 6లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని తెలిపారు. 69 గేట్లను ఎత్తి పూర్తి స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముంపు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.