ఈనెల 25న జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

ఈనెల 25న జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

ASF: జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాల మైదానంలో ఈనెల 25న జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆత్రం ధర్మారావు ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాలలో బాలబాలికలు, మహిళలు, పురుషులకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. మండలాల క్రీడాకారులు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, 2 ఫొటోలతో హాజరు కావాలన్నారు.