VIDEO: ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

VIDEO: ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: బ్రేక్ వైర్ కట్ అయి ఆటో బోల్తా పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. గుర్రంకొండ మండలం చెర్లోపల్లికి చెందిన 10 మంది భక్తులు సోమవారం ఆటోలో తంబళ్లపల్లె మల్లయ్యకొండకు వచ్చారు. దర్శనం చేసుకుని తిరిగి బయలుదేరారు. ఘాట్ రోడ్డులో ఆటో బ్రేక్ వైర్ కట్ అవడంతో బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.