'డైరెక్టర్ నాది 'లవ్ ఫెయిల్యూర్' ఫేస్ అన్నాడు'
'తేరే ఇష్క్ మే' మూవీ ప్రమోషన్స్‌లో నటుడు ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'దర్శకుడు ఆనంద్ L రాయ్‌ను పదే పదే ప్రేమలో ఓడిపోయిన పాత్రలే నాకు ఎందుకు ఇస్తారని అడిగాను. ఆయన నాతో 'మీది గ్రేట్ లవ్ ఫెయిల్యూర్ ఫేస్' అని చెప్పాడు. దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కాంప్లీమెంట్‌గా తీసుకున్నా' అని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.