VIDEO: గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే

BHPL: చిట్యాల మండల కేంద్రంలో ఇవాళ రూ.90 లక్షల వ్యాయంతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.