మానసిక ఉల్లాసానికి ‘హ్యాపీ సండే': కమిషనర్

మానసిక ఉల్లాసానికి ‘హ్యాపీ సండే': కమిషనర్

KRNL: ప్రజల మానసిక ఒత్తిడిని తగ్గించి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రభుత్వం ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం బిర్లా కాంపౌండ్‌లోని 'ఖానా-ఖజానా' వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు రోజువారీ పనుల ఒత్తిడిలో ఉంటారని, అలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం ఉల్లాసంగా గడపాలని ఆయన సూచించారు.