రంజాన్ మాసాన్ని శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్
NLG: జిల్లా వ్యాప్తంగా రంజాన్ మాసాన్ని శాంతియుతంగా, మతసామరస్యతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసాన్ని సోదర భావంతో నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.