కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు

కామారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గురువారం టిఎన్జిఎస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు వివిధ రంగులతో ముగ్గులను చూడ ముచ్చటగా అలంకరించారు. ముగ్గులను న్యాయ నిర్ణీతలు ప్రథమ, ద్వితీయ స్థానాలలో విజేతలను ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.