తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పలువురు చేరికలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పలువురు చేరికలు

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శనివారం పలు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ట్రైసిటీ అధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు వారందరికీ కండువాలు కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు.